అంగనవాడీ వర్కర్స్, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలిత డిమాండ్ చేశారు. సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు అర్బన ఒకటో సెక్టార్ అంగనవాడీ టీచర్లతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ అంగనవాడీల కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.ము నెప్ప, నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్, యూనియన జిల్లా కార్యదర్శి చౌడేశ్వరి, పార్వతి, జయశ్రీ పాల్గొన్నారు.