ప్రమీల రాజ్యం గురించి తెలిసే ఉంటుంది. మహాభారత కాలం నాటి ఈ రాజ్యంలో అందరూ ఆడవాళ్లే. ఇప్పుడు కూడా త్వరలోనే భూమ్మీద ఆడవాళ్ల రాజ్యం రాబోతుందట. అసలు మగ పరుగే ఫుట్టదట. అవును మీరు చదివేది నిజమే. ఇదేదో కల్పితం కాదు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడయ్యింది. మనిషి దేహంలో ఎక్స్, వై క్రోమోజోములు ఉంటాయి తెలుసు. ఇవే సంతానాన్ని నిర్ణయిస్తాయి. సంభోగం తరువాత అండంతో శుక్రకణాలు కలిసి పిండం ఏర్పడుతుంది. రెండు ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి.. ఎక్స్, వై జతకలిస్తే మగ పిల్లాడు పుడతాడు. అయితే, మగ సంతానానికి కారణమయ్యే ‘వై’క్రోమోజోములు క్షీణించిపోతున్నట్టు తాజా పరిశోధన ఒకటి గుర్తించింది.
మగ పుట్టుకను నిర్దారించే సదరు క్రోమోజోములో 16 కోట్ల ఏళ్ల కిందట 900 జన్యువులు ఉండేవని, ప్రస్తుతం అవి 55కు పడిపోయాయని తేలింది. వీటిలోనూ సగం జన్యువులకు అసలు ఏ నిర్ణాయక శక్తీ ఉండదని, మరో కోటి సంవత్సరాల్లో ఈ 55 కూడా కనుమరుగువుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఇక పుట్టే ప్రతి శిశువూ ఆడ తప్ప మగ ఉండదని అంటున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఇదే విషయం నిర్దారణ అయ్యింది. ఈ పరిశోధన ఫలితాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ప్రచురించారు. మగ శిశువును నిర్ణయించే జన్యువు క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు.
కాగా, ఈ అధ్యయనం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. పూర్తిగా మగాళ్లే లేకపోతే సృష్టికార్యం ఎలా జరుగుతంది? తదుపరి సంతాన వ్యాప్తి ఎలా..? ఏకలింగజీవి అయిన మానవుడికి ప్రకృతి నిర్దేశించిన పద్ధతి సంభోగం, వీర్యం-అండం కలయిక? ఇదేలా జరుగుతుంది అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, వై క్రోమోజోమ్ లేకపోతేనేం, అలాంటిదే మరో క్రోమోజోమ్ పుట్టుకొచ్చిందని ఎలుకలపై జపాన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన పేర్కొంది. కాబట్టి, భవిష్యత్తు గురించి బెంగపడాల్సిన పనిలేదు అంటున్నారు. అయినా, ఇప్పటికే వాతావరణ కాలుష్యం వల్ల మానవుల్లో వీర్యం- అండం నాణ్యత క్షీణించి, సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింది. దీంతో వంధ్యత్వం పెరిగిపోయింది.