రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. సెప్టెంబరు నెల నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు గుర్తించి, చక్కదిద్దేందుకు రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. మూడునెలల కిందట అదికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరకుల సరఫరాపై జిల్లాలవారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే చేపట్టింది. కాగా, జిల్లాలో 5,43,202 బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, నగదుకు అరకిలో చక్కెర ఇస్తారు. వచ్చేనెల నుంచి కొత్త ప్యాకింగ్‌తో పాటు నిల్వవున్న పాత ప్యాకింగ్‌లోని చక్కెర పంపిణీ చేస్తామని డీఎస్వో శంకరన్ తెలిపారు.