పాలకొండ నగరపంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లలో పందులు, ఆవులు సంచారాన్ని నిషేధిస్తున్నామని నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు తెలిపారు. యజమానులు ఆవులను తమ ఇంటి ఆవరణలో, పందులను పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు సెప్టెంబరు 10వ తేదీ వరకు సమయం కేటాయిస్తున్నామని, ఆలోగా వారి సంరక్షణలో ఉన్న ఆవులను, పందుల ను నిర్ణీత ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాకాకుండా సెప్టెంబరు 10 తర్వాత పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో ఎక్కడ కనిపించినా వాటిని నగర పంచాయతీ సిబ్బంది స్వాధీనం చేసుకుని పట్టణానికి దూరంగా అడవుల్లో వదిలివేయాల్సి వస్తుందని హెచ్చరించారు.