పల్నాడు జిల్లా చిలకలూరిపేట MLA ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు ఉన్నతాధికారులు ఛార్జ్మెమోలు ఇచ్చారు. ఎలాంటి అధికార హోదా లేని ఆమె ఇంటివద్ద వేడుకల్లో ఐదుగురు SIలు, ఇద్దరు CIలు పాల్గొన్న ఫొటోవైరల్ కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెతో కేక్ కట్ చేయించిన అధికారులను తన కార్యాలయానికి పిలిపించి SPస్వయంగా విచారించారు.