రాజమహేంద్రవరంలోని టౌన్ హాలును అభివృద్ధి చేసి పూర్వవైభవాన్ని తీసుకొస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరంలో టౌన్‌హాలును ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కూటమి నాయకులు వై.శ్రీను, కురగంటి సతీష్‌లతో కలిసి గురువారం పరిశీలించారు. వీరేశలింగంపంతులు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన టౌన్ హాలు నేడు దయనీయస్థితిలో ఉందన్నారు. వీరేశలింగం పంతులు ఇల్లు, టౌన్ హాలు అభివృద్ధిపై ట్రస్ట్ సభ్యులతో సమీక్షించి పూర్వవైభవం తీసుకువచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.