కాకినాడలోని వాకలపుడి వద్దనున్న ఎన్టీఆర్ బీచ్ పార్క్ సందర్శకులకు అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడలో శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పంచాయతీ, సర్వే, పర్యాటకశాఖ, శిల్పారామం అధికారులతో కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.