ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే రాము గారు ముంపు బాధిత గ్రామాల్లో ప్రజలకు ఆహారం అందేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే రాము ఆదేశాలతో నందివాడ మండలంలోని ముంపు గ్రామాలైన జొన్నపాడు, రామాపురం, అరిపిరాల, చేదుర్తిపాడు, పెదలింగాల, చిన్న లింగాల, పుట్టగుంట గ్రామాల్లో పార్టీ నేతలతో కలిసి టిడిపి నాయకుడు కామేపల్లి తులసి బాబు మంగళవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడిన నాయకులు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే రాము ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు చేశామని ఏ చిన్న సమస్య తరలించిన తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముంపు గ్రామాల్లో పశువుల సంరక్షణ ఇతర కారణాలతో పునరావాస కేంద్రాలకు వెళ్ళని బాధిత ప్రజల ఇళ్ల వద్దకే టిడిపి నాయకులు వెళ్లారు. టిడిపి నాయకులు మరియు ప్రజా వేదిక సిబ్బంది నడుంలోతు నీళ్లలో బాధితుల ఇళ్లకు వెళ్లి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కష్టాల్లో ఉన్న తమ ఇళ్ల వద్దకు వచ్చి ఆహారం అందేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.పర్యటనలో భాగంగా చేదుర్తిపాడు గ్రామంలో బుడమేరుకు గండిపడగా స్థానికులతో కలిసి గండి పూర్చడంలో సహకరించిన టిడిపి నాయకులు గ్రామంలో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాలతో వరద తీవ్రత తగ్గేవరకు నందివాడ మండలంలోని వరద ముంపు గ్రామాల ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయపడతామని ఈ సందర్భంగా టిడిపి నాయకులు పేర్కొన్నారు.ఈ పర్యటనలో టిడిపి నాయకులు చేకూరు జగన్మోహనరావు, పలువురు టిడిపి నాయకులు రెవెన్యూ, పోలీస్, మరియు పలు శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.