వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కొసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేసింది. ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్‌కు అప్పగించింది. స్వచ్చంధంగా ముందుకు వచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌లో సంప్రదించాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa