విజయవాడ వరద ముంపు ప్రాంతంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు(మంగళవారం) పర్యటించారు. 61, 62, 63, 64వ డివిజన్లలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ బాధితులకు ఆహారం తీసుకెళ్లి మంత్రి పంపిణీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రజలను ముంపు ప్రాంతం నుంచి బయటకు తీసుకు వచ్చేలా మంత్రి చర్యలు చేపట్టారు. స్థానిక అధికారులు, సహాయక బృందాలను సమన్వయం చేస్తూ ప్రజలకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో అధికారులు జాప్యం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు.