భారీ వర్షాల కారణంగా బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. బుడమేరుకు భారీగా వరద వచ్చి చేరడంతో విజయవాడలోని 16 డివిజన్లు ముంపునకు గురయ్యాయి. దాదాపు రెండు రోజులుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం జలదిగ్భంధంలో ఉండిపోయారు. బుడమేరులో ప్రస్తుతం 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. బుడమేరు కాస్త శాంతించడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు వరద ధాటికి వందల ఎకరాల్లో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.