ప్రభుత్వం ఈనెల ఆరో తేదీలోగా తమ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే ఈనెల ఏడో తేదీన మద్యం దుకాణాల వద్ద బంద్ పాటిస్తా మని ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.ఈమేరకు సోమవారం ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపో మేనేజర్ సుబ్బారావుకు అసోసియేషన్ ప్రతినిధులు పి.రామచంద్రరావు, ఎస్. భాస్కర్, జి.కోటేశ్వరరావు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లా డుతూ నూతన మద్యం విధానంలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు షాపులు అప్ప గించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.ఇప్పటికే సంఘం తరపున ముఖ్య మంత్రికి రాసిన లేఖలో తమ సమస్యను వివరించామని తెలిపారు. ప్రైవేటు వైన్‌షాపుల వల్ల తామంతా ఉపాధి కోల్పోతామని ఆందోళన వ్యక్తంచేశారు.