ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారిశుధ్యంలో ఏలూరు జిల్లా ప్రధమ స్తానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2024, 02:51 PM

పారిశుధ్య నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణకు సంబంధించి పలు అంశాలును పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్‌లు ఇచ్చారు. జిల్లాలో 1233 ట్యాంక్‌ల క్లీనింగ్‌కు గాను 1,196 క్లీనింగ్‌ చేసి 97 శాతం ప్రగతిని జిల్లా సాధించింది. క్లోరినేషన్‌ విషయంలో జిల్లాలో 1271 ట్యాంకులకు 1264 ట్యాంకులలో క్లీనింగ్‌ చేసి 99.45 శాతం ప్రగతి సాధించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం క్లీన్‌ చేయడడంలో 100 శాతం ప్రగతి సాధించింది. పొదలు తొలగింపు విషయంలో 1097 ప్రదేశాలకు 1094 ప్రదేశాల్లో చేసినందుకు 99.73 శాతం, మురుగు కాల్వల్లో పూడిక తీతకు సంబంధించి 97.34 శాతం, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించడంలో 99.60 శాతం ప్రగతి సాధించి ప్రభుత్వం ఇచ్చిన ఆరు టాస్క్‌లలో ఓవర్‌ఆల్‌గా 99.13 శాతం ప్రగత సాధించి రాష్ట్రంలో జిల్లా పారిశుధ్య నిర్వహణలో ప్రథమ సాఽ్థనం సాధించింది. అన్నమయ్య జిల్లా ద్వితీయ స్థానం సాధిం చగా, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా తృతీయ స్థానాలు సాధించాయి. పారిశుధ్య నిర్వహణలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానం సాధించినందుకుగాను జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్‌ అభినందించారు. గ్రామాల్లో మురుగుకాల్వల నిర్వహణ, తాగునీరు, ట్యాంకులు శుభ్రపరచడం, పంచాయతీ చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించడం, గ్రామాల్లో చెత్త కుప్పలు లేకుండా చేయడం, పైప్‌లైన్లు సరిజేసి స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లాలకు పారిశుధ్య నిర్వహణపై ర్యాంకింగ్‌లు ఇచ్చారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పారిశుధ్య కార్యక్రమాలు పర్యవేక్షించడానికి ప్రభుత్వం పీఆర్‌ వన్‌ యాప్‌ అభివృద్ధి చేశారు. పారిశుఽధ్య నిర్వహణకు సంబంధించి పంచాయతీ సిబ్బంది ఫొటోస్‌ తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసి, పారిశుధ్య కార్యక్రమాలు చేసిన ఫొటోస్‌ను తిరిగి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుం ది. డీపీవో శ్రీవివాస విశ్వనాథ్‌ క్షేత్రస్థాయి తనిఖీలు , టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి సిబ్బందిని అప్రమత్తం చేయడం, నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించడం , సకాలంలో తాగునీటి పరీక్షలు, క్లోరినేషన్‌ చేయించడం, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసిజర్‌ ద్వారా టైం లైన్‌ పెట్టి నిరంంతర పర్య వేక్షణ చేయడం, పారిశుధ్య కార్మికుల నిస్వార్థ సేవలు, సిబ్బంది సహకారం వల్ల జిల్లా పారిశుధ్య నిర్వ హణలో ప్రథమ సాఽ్థనంలో నిలిచిందని చెబుతున్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు డయేరియా , మలేరియా, డెంగీ, చికెన్‌గునియా తదితర వ్యాధుల బారిన పడకుండా నివారిస్తున్న చర్యలు , ముఖ్యం గా జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి గ్రామాల్లో ఉన్న ఓహెచ్‌ఆర్‌ ట్యాంకు ప్రధాన వాల్స్‌ ఛాంబర్స్‌లో నిల్వ ఉన్న కలుషిత వర్షపు నీటిని తొలగించి తాగునీరు సరఫరా చేయడం పవన్‌ కల్యాణ్‌ దృష్టిని ఆకర్షించింది. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఏలూరు జిల్లా చేపడుతున్న చర్యలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అమలు చేయాలని ఆయన సూచించారు. జిల్లా ప్రథమ స్థానం సాధించినందుకు మంత్రి పార్థసారథి, కలెక్టర్‌ వెట్రిసెల్విలు డీపీవో విశ్వనాథ్‌ను అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com