నూజివీడు ఎమ్మెల్యే, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి స్ఫూర్తితో చాట్రాయి మండలంలోని చనుబండకు చెందిన టీడీపీ దళిత నాయకుడు నక్కా రాము తన సొంత నిధులతో బుధవారం 2 వేల వాటర్ బాటిల్స్‌ను ఆటోలో విజయవాడ తీసుకువెళ్ళి వరద బాధితులకు పంపిణీ చేశారు. నక్కా రామును మంత్రి సారథి అభినందించి, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించి తమ శక్తి మేర వరద బాధితులకు సహాయం అందించాలని పిలుపు నిచ్చారు.