విషజ్వరాలు ప్రబలతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఇచ్ఛాపురం మండలం, డొంకూరు గ్రామానికి చెందిన పొన్నగంటి సీతమ్మ(70) విషజ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సీతమ్మ గత 15రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఇచ్ఛాపురంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం జ్వరం తీవ్రం కావడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందింది. సీతమ్మకు ఇద్దరు కుమారైలే ఉండడంతో.. చిన్న కుమారై చంద్రమ్మ చితికి నిప్పటించి దహన సంస్కారాలు పూర్తిచేశారు. కాగా డొంకూరులో ప్రటి ఇంటిలో జ్వరపీడితులు ఉన్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.