ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో పెరుగుతున్న వరద దృష్ట్యా అధికార యంత్రాంగాన్ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అప్రమత్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 3. 4 లక్షల క్యూసెక్కులు దాటి వరద నీరు ప్రవహిస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కి అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు.