ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏలేరు వరద ఉధృతికి జగనే కారణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 07:26 PM

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో టీడీపీ హాయాంలో మంజూరై జరుగుతున్న ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణ పనులను జగన్‌రెడ్డి రద్దు చేసి నేటి వరద ముంపునకు కారణమయ్యారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చే శారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు ఆయా మండలాల పరిధిలోని మాధవపురం, గోకివాడ, నరసింగపురం, జములపల్లి, కోలంక, కొడవలి, చేబ్రోలు, మల్లవరం, తాటిపర్తి తదితర గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని, ముంపునకు గురైన పొ లాలను పరిశీలించారు. తాను ఎమ్మెల్యేగా ఉం డగా తీసుకువచ్చి ఆధునీకరణ పనులను పూర్తి చేసి ఉంటే నేడు ఈ ముంపు ఉండేది కాద న్నా రు. ఏలేరు, సుద్దగడ్డ వరద బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com