ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఊరట లభించింది. ఆయన పాస్‌పోర్ట్ రెన్యువల్‌కు సంబంధించి కీలక తీర్పును ఇచ్చింది. ప్రజా ప్రతినిధుల కోర్టు పాస్‌పోర్ట్ రెన్యువల్‌ను ఏడాదికి పరిమితం చేయగా.. ఏపీ హైకోర్టు ఐదేళ్లకు పెంచాలని ఆదేశించింది. అయితే విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా వెళ్లి రూ. 20 వేల పూచీకత్తు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులన్నీ అలాగే ఉంటాయని కోర్టు తెలిపింది. హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే పూర్తిగా క్లారిటీ వస్తుదంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాస్‌పోర్టు కష్టాలు ఎదురయ్యాయి. మొన్నటి వరకు సీఎం హోదాలో డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ ద్వారా విదేశాలకు వెళ్లిన జగన్.. ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి జగన్ లండన్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే డిప్లొమాటిక్ పాస్ట్‌పోర్టును సంబంధిత అధికారులు రద్దు చేయడంతో ఆయన సాధారణ పాస్ట్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. జగన్ తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఐదేళ్ల పాటూ రెన్యువల్ చేయాలని కోర్టు ఆదేశించింది.
వైఎస్ జగన్ పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకునేందుకు విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే జగన్‌పై నమోదైన ఓ పరువు నష్టం కేసు విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో పెండింగ్ ఉందని.. కాబట్టి ఎన్‌వోసీ తీసుకురావాలని పాస్‌పోర్ట్ కార్యాలయంలో అధికారులు సూచించారు. దీంతో విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎన్‌వోసి కోసం ఆశ్రయించగా.. జగన్ పాస్‌పోర్ట్‌ను ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే తమ ముందు హాజరై రూ. 20వేల స్వీయ బాండ్‌తో పూచీకత్తు సమర్పించాలని షరతులు విధించింది
విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు విధించిన షరతులపై వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షరతులు సహేతుకంగా లేవని.. తనకు పాస్‌పోర్టును ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని కోరారు. సీబీఐ కోర్టు కూడా తన పాస్‌పోర్ట్‌ను ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని ఆదేశిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాలను సవాల్ చేశారు.. తన పాస్‌పోర్ట్‌ను ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని కోరారు. అయితే ఈ నెల 6 (శుక్రవారం)న హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఈ నెల 9 (సోమవారం)కి విచారణ వాయిదా వేసింది. అయితే సోమవారం కోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించగా.. హైకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.. వైఎస్ జగన్ పాస్‌పోర్టును ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని ఆదేశించింది. దీంతో వైఎస్ జగన్ లండన్ ప్రయాణానికి దాదాపుగా అడ్డంకులు తొలగిపోయినట్లే. వాస్తవానికి వైఎస్ జగన్ ఈ నెల 3న లండన్ వెళ్లాల్సి ఉంది.. కానీ పాస్‌పోర్ట్ సమస్య కారణంగా ఆ ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa