ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ రెండు రోజుల నుంచి కొనసాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బోట్స్ కెపాసిటీ 120 టన్నులు కంటే ఎక్కువ ఉన్న కారణంగా లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందన్నారు. కట్ చేస్తే 50% వెయిట్ తగ్గుతుందని.. అప్పుడు బోటు పైకి లాగవచ్చన్నారు. బోట్లకు మూడు లేయర్స్ ఉన్న కారణంగా కట్ చేయడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. కాకినాడ నుంచి బోట్లు తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులుని తీసుకొస్తున్నామని తెలిపారు. సాయంత్రం నుంచి ఆయన కూడా తనదైన మార్గంలో బోట్లు తొలగింపు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. లోకల్‌గా ఉన్న బోట్స్‌ను కూడా ఉపయోగించి బోట్స్‌ను తొలగింపు కార్యక్రమం చేపడతామన్నారు. సాయంత్రానికి ఒక బోటు తొలగింపుపై ఒక స్పష్టత వచ్చిందని.. ఇప్పుడు కొట్టుకొచ్చిన బోట్స్ గతంలో కొట్టుకొచ్చిన బోటు కంటే రెండింతలు ఎక్కువగా ఉందని తెలిపారు. స్కూబా డైవర్స్ 24 గంటలు కష్టపడి అండర్ వాటర్‌లో కటింగ్ చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.