రాష్ట్రంలో వైద్య విద్యను పేద విద్యార్థులకు కూడా చేరువ చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వెల్లడించారు. అదే చంద్రబాబు నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 14 ఏళ్లు సీఎంగా పని చేసినా, తన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. వైయస్ జగన్ చిత్తశుద్ధి, కృషి వల్ల రాష్ట్రంలో కొత్తగా 2,550 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చి, మొత్తం దాదాపు 5 వేల సీట్లకు చేరుకునేవని తెలిపారు. ఆ కాలేజీల్లో సీట్ల కోసం కట్టే ఫీజులన్నీ, ఆయా కాలేజీల (ప్రభుత్వ)కు వెళ్తాయి తప్ప, వేరెవరి జేబుల్లోకి కాదని, ఆ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బులు ఆ కాలేజీల నిర్వహణ, అభివృద్ధికి వినియోగిస్తారని.. ఇంకా కొత్త మెడికల్ కాలేజీలు భవిష్యత్తులో కూడా సమర్థంగా నడిచేలా గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు కేటాయిస్తే.. నాడు విపక్ష టీడీపీతో పాటు, ఎల్లో మీడియా శివాలెత్తిపోయిందని జూపూడి తెలిపారు.