కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ ప్రజల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజల ఆరోగ్యం విషయంలో పలు పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన-ఆయుష్మాన్ భారత్ ప్రయోజనం పొందుతారు. ధనిక, పేద అనే తేడా ఉండదు. అయితే అందరినీ దీని పరిధిలోకి తీసుకురానున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేసారు. అలాగే ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఇది కొత్త కేటగిరీ అని అన్నారు. దీని కింద 70 ఏళ్లు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు ఉచిత చికిత్స సౌకర్యంతో పాటు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందిస్తుంది.