తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పెదవేగి సర్కిల్ పోలీసు సిబ్బంది అరెస్టు చేశారని ఏలూరు ఎస్పీ కిషోర్ చెప్పారు. పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్ళమూడిలో తాళం వేసి ఉన్న ఇంటిని ఈఏడాది మే 29న రాత్రి వేళ పగులగొట్టి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహ రించుకుపోయారు. ఈ ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి సీఐ అబ్దున్‌నబీ, ఏలూరు సీసీఎస్ సీఐ మురళీకృష్ణ, పెద పాడు ఎస్‌ఐ సుభశేఖర్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి కలపర్రు టోల్‌గేటు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మోటారు సైకిల్‌పై వస్తున్న ముగ్గురుని ఆపగా వారు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసు కుని విచారించారు. విజయవాడ చిట్టినగర్‌లోని రామరాజ్‌నగర్‌కు చెందిన పేకేటి వెంకటరెడ్డి (36), నూజివీడు మండలం సీతారాంపురం గ్రామానికి చేకూరి వెంకటరెడ్డి (35) విజయవాడ కేపీ రోడ్డు కొత్తపేటకు చెందిన షేక్ అల్లా భక్షు (39)లను విచారించారు. ఈ ముగ్గురు తాళ్ళమూడిలో దొంగతనంతో పాటు పెదపాడులో మరో మూడు ఇళ్ళ దొంగతనాలు చేశారని నూజీవీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మూడు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి 82 గ్రాముల బంగారపు వస్తువులు, నాలుగు కేజీల 756 గ్రాముల వెండి వస్తువులు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ సొత్తు మొత్తం 10 లక్షల 78 వేలు రూపాయలని తెలిపారు. ఎస్‌ఐ సుభశేఖర్, పెదవేగి సర్కిల్ టీమ్, ఏలూరు సీసీఎస్ ఎస్‌ఐ చంద్రశేఖర్‌లను, సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.