విజయవాడలోని వరద బాధితల కోసం విరాళాలు సేకరించాలని ఉయ్యాలవాడ వెలుగు ఏపీఎం దాసన్న పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఆయా గ్రామాల వీవోఏలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ కనీసం రూ. 50కు తగ్గకుండా విరాళంగా ఇవ్వాలన్నారు. మండలం నుంచి కనీసం రూ. లక్ష వరద బాధితుల కోసం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. సోమవారం నాటికి వందశాతం పూర్తి అయ్యేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో సీసీలు గంగన్న, నాగన్న ఉన్నారు.