జలుమూరు, (సారవకోట): సారవకోట రెల్లి వీథికి చెందిన కోటిపల్లి వీరయ్య (62) విశాఖ కెజిహెచ్లో చికిత్స పొందుతూ బుదవారం రాత్రి మృతిచెందాడు. స్థానికులు వివరాలు మేరకు గత నాలుగు రోజులుగా పడిన వర్షాలకు ఇంటిగోడ తడిసి బుధవారం మద్యాహ్నం కూలిపోయింది. ఈ ప్రమాదంలో కోటిపల్లి వీరయ్యకు తలకు దెబ్బలు తగిలాయి. చికిత్స నిమిత్తం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కెజిహెచ్కి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కెజిహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు భార్య సింహాద్రి తహసీల్దారు విజయలక్ష్మికి ఫిర్యాదు చేసారు. సింహాద్రి ఫిర్యాదు మేరకు సిబ్బందితో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు తెలిపారు. ఇతనికి భార్య సింహాద్రి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిగిపోయినట్లు స్థానికులు తెలిపారు.