శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలం పెద్దపేట జంక్షన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడివలస సచివాలయం వీఆర్వో దూసి సంజీవరావుకు తీవ్ర గాయాలయ్యాయి. విధులకు హాజరయ్యేందుకు పాలకొండ రోడ్డులో బైక్‌పై వెళ్తుంగా.. ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వీఆర్వోను చికిత్స నిమిత్తం పాలకొండ ఆసుపత్రికి, అక్కడ నుంచి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa