ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డ్ చైన్‌తో పాటు వినాయకుడిని నిమజ్జనం చేసిన ఫ్యామిలీ.. 10 గంటలు వెతికినా దొరికిందా?

national |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 10:32 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక నిమజ్జనాలు కూడా ప్రారంభమై.. గంగమ్మ ఒడికి గణేషుడు చేరుకుంటున్నాడు. డీజే, డప్పులు, డ్యాన్సులతో గణేష్‌ విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఓ కుటుంబం చేసిన పని.. చివరికి అధికారులతోపాటు ఎమ్మెల్యేను కూడా ఉరుకులు పరుగులు పెట్టించాయి. వినాయకుడిని గోల్డ్ చైన్‌తో అలంకరించిన ఆ కుటుంబ సభ్యులు నిమజ్జనం సందర్భంగా దాన్ని తీయడం మర్చిపోయారు. నిమజ్జనం చేసి ఇంటికి వచ్చిన తర్వాత గోల్డ్ చైన్ విషయం గుర్తుకు తెచ్చుకున్న ఆ కుటుంబం.. హుటాహుటిన అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టారు. 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి.. ఆ బంగారు గొలుసును వెలికి తీశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. విజయనగర్‌లోని దాసరహళ్లి ప్రాంతంలో నివసించే రామయ్య, ఉమాదేవి దంపతులు.. తమ ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పూలు, పండ్లు, బంగారు ఆభరణాలతో గణేషుడిని భారీగా అలంకరించారు. ఇందులో భాగంగానే 60 గ్రాముల బంగారు గొలుసును కూడా ఆ విగ్రహానికి వేశారు. దాని విలువ రూ.4 లక్షలు అని పేర్కొన్నారు. అయితే వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించిన తర్వాత దగ్గర్లో ఉన్న 


తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రామయ్య, ఉమాదేవి దంపతులకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. తమ ఇంట్లో గణేషుడిని ప్రతిష్టించిన సమయంలో ఆ విగ్రహాన్ని 60 గ్రాముల బంగారంతో అలంకరించినట్లు గుర్తొచ్చింది. అయితే నిమజ్జనం సమయంలో దాన్ని తీయడం మరిచిపోవడంతో.. నిమజ్జనం చేసిన గంట సేపటి తర్వాత మళ్లీ ఆ మొబైల్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బందికి విషయం చెప్పడంతో.. ఆ విగ్రహం నిమజ్జనం చేసే సమయంలో గణపతి మెడలో గొలుసును చూశామని.. అయితే అది రోల్డ్ గోల్డ్ అని భావించి వదిలేసినట్లు చెప్పారు.


దీంతో షాక్ అయిన రామయ్య, ఉమాదేవి దంపతులు.. దగ్గర్లో ఉన్న మాగడి రోడ్డు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి.. ఆ మొబైల్ ట్యాంక్ వద్ద గాలింపు చేపట్టారు. అంతేకాకుండా వారికి ఎమ్మెల్యే ప్రియా కిషోర్ కూడా సాయం చేశారు. ఆ మొబైల్ ట్యాంక్ కాంట్రాక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే.. ఆ ట్యాంక్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయాలని సూచించారు. ఆ ట్యాంక్‌లో దాదాపు 10 వేల లీటర్ల నీరు ఉండగా.. మొత్తం బయటికి తీసినప్పటికీ ఆ బంగారు గొలుసు జాడ కనిపించలేదు. దీంతో నిమజ్జనం చేసిన తర్వాత నీటిలో కరిగిన గణేష్ విగ్రహాల మట్టిలో వెతికారు. దాదాపు 10 మంది సిబ్బంది బంగారు గొలుసును వెతికే పనిలో పడ్డారు. చివరికి 10 గంటల తర్వాత ఆ బంగారు గొలుసు.. ఆ మట్టిలోనే దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com