చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఆసుపత్రికి దానం చేసిన తర్వాత, వైద్య విద్యార్థులు ప్రధానంగా వాటిని కోయడం(డిసెక్షన్) అవయవాలను వేరుగా విభజించి అధ్యయనం చేయడం నేర్చుకుంటారు. మృతదేహం పాడవకుండా -20°C వద్ద ఉంచుతారు.
లేదా ఫార్మాలిన్ పూస్తారు. ప్రయోగ పాఠాలు పూర్తయిన కొన్నేళ్ల తర్వాత ఆసుపత్రి వాటిని దహనం లేదా ఖననం చేస్తుంది. ఒకవేళ డోనర్ ముందుగానే కోరితే, మృతదేహాన్ని తిరిగి వారి కుటుంబీకులకే అప్పగిస్తారు.