నెల్లూరు జిల్లాలో ఈరోజు( మంగళవారం) గ్రీవెన్స్‌లో అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన సమస్యను అధికారులకు విన్నవించింది. బాధిత మహిళ ఫిర్యాదును అధికారులు విని చలించిపోయారు.మొన్నటి ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదన్న కక్షతో ఎస్సీనైన తనపై అత్యాచారం చేసి చంపాలని చూశారని నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం తూర్పు పోలినేని పాలెం గ్రామానికి చెందిన బాధితురాలు ప్రజా దర్బార్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. బహిర్భూమికి వెళ్లగా తనను అత్యాచారం చేశారని వాపోయింది. నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె ఈరోజు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి సమస్యను బాధితురాలు వివరించింది. దోషులకు కఠిన శిక్షపడేలా బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు.