వంద రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు. ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందిస్తామని చెపన్పారు. మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10 వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10 వేలు, చిరు వ్యాపారులకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. టూవీలర్స్‌కు రూ.3 వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.10 వేలు చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా డ్యామేజీ అయితే రూ.9 వేలు, పూర్తిగా డ్యామేజీ అయితే రూ.20 వేలు అందిస్తామని పేర్కొన్నారు. సెరీ కల్చర్‌కు రూ.6 వేలు. పశువులకు రూ.50 వేలు, వరి ఎకరాకు రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం వెల్లడించారు. ’’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
నీరు–చెట్టు నిధులకు సీఎం గ్రీన్ సిగ్నల్...
నీరు- చెట్టు పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీరు-చెట్టు పెండింగ్ బిల్లులపై మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ సీఎంను కలిశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు దశల వారీగా నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. తొలి విడతలో రూ.259 కోట్లు విడుదల చేయాలని సూచించారు.