ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళలు వేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. బుధవారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ.. అక్రమంగా ఉన్న చంద్రబాబు ఇంటికి ముందు తాళం వేయాలని అన్నారు. ఇక.. అప్పటిదాకా చంద్రబాబు సైతం తన నోటికి తాళం వేసుకోవాలని ఎద్దేవా చేశారు.