తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి భక్తులకు ఇచ్చే లడ్డూలు నాణ్యతగా లేకపోవడం బాధాకరమని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తిరుమల లడ్డూకు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటున్నారని తెలిపారు. లడ్డూ కల్తీపై తనకు మాట్లాడటానికి కూడా కొంత ఇబ్బందిగా ఉందని అన్నారు.
పవిత్రంగా లడ్డూలో కలపాల్సిన పదార్థాలు చాలా ఉన్నాయని అన్నారు. అవి కాకుండా అపవిత్రంగా ఉండే పదార్థాలు కలిపారని మండిపడ్డారు. ‘‘మనకు తెలియకుండా ఇన్నిరోజులు కల్తీ చేసిన లడ్డూను తిన్నామా.. ఇంత ఘోరాతి ఘోర మహాపాపం తెలియకుండానే మూటకట్టుకున్నామా. 100 పాపాలను శ్రీకృష్ణుడు ఓపికగా లెక్క పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. జగన్ ప్రభుత్వం ఆలయాల ధ్వసంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టింది. మేము కూడా తిరుమల లడ్డూని పంచాం. ఆ భగవంతుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తిరుమలకు వచ్చాం’’ అని యామిని వెల్లడించారు.