తమిళనాడులోని 11 ప్రదేశాల్లో ఈరోజు ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదం కుట్ర కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది. చెన్నై, పుదుకొట్టై, కన్యాకుమారిల్లో సోదాలు జరుగుతున్నాయి. హిజ్ ఉత్ తహిర్ కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు రిక్రూట్మెంట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa