ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలానికి చెందిన కీలక టీడీపీ నాయకులైన ఆనెపు రామకృష్ణనాయుడు... ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ పేరిట పోరాటం నిర్వహిస్తూ పంచాయతీలకు నిధులు కేటాయింపుపై గత ప్రభుత్వ హయాంలో నిరసన చేపట్టారు. ఈయనకు ప్రస్తుతం ‘ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్’ డైరక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
అయితే ఈ పదవి తన గుర్తింపునకు చిన్నదని.. అప్రాధాన్యమైదని.. దీనిపై సుముఖత లేనట్లు సన్నిహితుల వద్ద రామకృష్ణనాయుడు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం.