సాలూరు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల లడ్డు ప్రసాదం గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా బుధవారం కూటమి నేతలు పూజలు చేశారు. తొలుత టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నిమ్మాది తిరుపతిరావు, ఆముదాల పరమేశు,గుల్ల వేణు, గణపతి, రిషివర్థన్, శివకృష్ణ, జగదీష్, విశ్వేశ్వరరావు, అప్పలనాయుడు ఆలయాన్ని శుద్ధిచేశారు. అనంతరం శ్రీవారికి రుత్వికుడు నారాయణాచార్యులతో విశేష పూజ చేయించారు. కార్యక్రమంలో కొనిసి చిన్ని, సత్యనారాయణ, హర్ష, దుర్గ, శ్రీకాంత్, కోటి, రాజు పాల్గొన్నారు.