కురుపాం జడ్పీ ఉన్నత పాఠశాలలో అర్ధాంతరంగా నిలిచిపోయిన భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా హెచ్ఎం శంకరరావుకు వివరాలు అడిగితెలుసున్నారు. నిర్మాణం మధ్యలో నిలిచి పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయించాలని టీడీపీ నాయకులు, పాఠశాల కమిటీ చైర్మన్,సభ్యులు కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోలా చిరంజీవి, ఎస్.వెం కటరావు,ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు.