విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి స్థా నికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్లకు చెందిన సింగరోతు శ్యామ్‌కుమార్(40) మిమ్స్ వైద్య కళాశా లలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తన భార్య తో కలిసి రాజాంలోని అత్తవారింటికి వెళ్లాడు. తిరిగి సోమవా రం ఉదయం ఉద్యోగ నిమిత్తం నెల్లిమర్లలో మిమ్స్ కళాశాలకు బయలుదేరాడు. మరి కాసేపట్లో చేరుకుంటాడనగా గుర్ల మండ లం ఎస్ఎస్ఆర్పేటకు వచ్చేసరికి నెలిమర్ల నుంచి కెల్ల వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో శ్యామ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికు లు వెంటనే 108కి ఫోన్ చేయగా ఆ వాహనం వచ్చే లోపే శ్యామ్‌కుమార్ మృతి చెందా డు.
మృతదేహాన్ని చీపురుపల్లి ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నెలిమర్ల గ్రామం కీర్తి వీధికి చెందిన శ్యామ్ కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితమే శిరీషతో వివాహమైంది. తండ్రి కొద్ది రోజుల క్రితమే చనిపోయాడు. దీంతో అమ్మను, ఇద్దరు అక్కలను, భార్యను తానే పోషిస్తూ కుటుంబ భారం మోస్తున్నాడు. ఇలాంటి సమయంలో పెద్దదిక్కు కోల్పోవడంతో కు టుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.