తనను పదేళ్ల క్రితం పెళ్లిచేసుకుని కాపురం చేస్తూ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని హైదరాబాద్‌కు చెందిన మహిళ ఆవేదన వ్య క్తం చేసింది. శృంగవరపుకోట మండలంలోని పోతనాపల్లి గ్రామంలో ఉన్న తన భర్త పూడి సుధాకర్ ఇంటిముందు సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి భైఠాయించింది.
ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేఖర్లకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పూడి సుధాకర్ హైద్రాబాద్ సీసీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సమయంలో పక్కనే ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న పరమేశ్వరీ అనే మహిళను ప్రేమించి, పెద్దల సమక్షంలోనే యాదగిరి గుట్ట ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఐదేళ్ల పాప ఉంది. అయితే సరిగ్గా ఏడాది క్రితం తండ్రి చనిపోయాడని చెప్పి సుధాకర్ హైద్రాబాద్ నుంచి బయలుదేరి స్వగ్రామానికి వచ్చి విశాఖపట్నంకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత విషయం తెలుసుకున్న పరమేశ్వరి సుధాక ర్ కుటుంబసభ్యులను ప్రశ్నిస్తే వారు హైద్రాబాద్ వచ్చి న్యాయం చేస్తామని చెప్పారు. పెద్దమనుషులతో కలిసి హైద్రాబాద్ వెళ్లిన సుధాకర్ కుటుంబ సభ్యులు న్యాయం చేయకపోవడంతో మోసపోయానని గ్రహించిన పరమేశ్వరి హై ద్రాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సుధాకర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదవ డంతో ఉద్యోగం నుంచి తొలగించారు.ఆమెకు మద్దతుగా వచ్చిన జాతీయ మ హిళ ఉపాధ్యక్షురాలు జయంతి గౌడ్ మాట్లాడుతూ.... ఒక దళిత మహిళను ఈ వ్యక్తి మోసంచేశాడని, న్యాయం చేయాలని లేనిపక్షంలో పోరాటం చేయడంతో పాటు రాష్ట్రహోంమంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.