తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. దీనిలో భాగంగా సాయంత్రం ఆలయంలో సేనాధిపతిని సుందరంగా అలంకరించి విశేష సమర్పణ కావిస్తా రు. అనంతరం రాత్రి 7 గంటలకు మాడవీధులగుండా ఊరేగింపు నిర్వహిస్తా రు. తర్వాత రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
యాగశాలలో అర్చకస్వాములు కైంకర్యాలు నిర్వహించి అంకురార్పణ(బీజవాపం) నిర్వహిస్తా రు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇక, శుక్రవారం సా యంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి పెద్దశేషవాహనాలతో వాహన సేవలు ప్రారంభంకానున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా గోవిందాచార్యులు వ్యవహరిస్తారు.