జంతు దినోత్సవాన్ని జర్మనీకి చెందిన డిస్కవరీ మ్యాన్ 'హీన్రిచ్ జిమ్మెర్‌మన్' 1925 మార్చి 24న జర్మనీలో తొలిసారిగా నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి 5వేల మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. ఇక 1931 మే నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో జరిగిన జంతు రక్షణ సదస్సులో అక్టోబరు 4ను అంతర్జాతీయ జంతు దినోత్సవంగా అన్ని దేశాలు ఏకగ్రీవంగా అమోదించాయి. అలాగే పర్యావరణ పరిరక్షకుడిగా పేరుగాంచిన 'సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి' స్మారకాన్ని పురస్కరించుకొని దీనిని జరుపుకుంటున్నారు.