శుక్రవారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి పదవీ స్వీకార సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ..... అందరూ కలిసికట్టుగా పార్టీని ఒక తాటిపై తీసుకు వచ్చి విజయానికి కృషి చేద్దామన్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ.... ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ ప్రతి జిల్లా నాయకులతో రివ్యూ మీటింగ్లు పెట్టి పార్టీని బలోపేతం చేస్తున్నారని గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో పార్టీని ఈ సారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.