మా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే పొరపాటే. ఇకపై ఎవరికి వారే రెడ్ బుక్ రాసుకోండి అని సజ్జల రామకృష్ణ రెడ్డి హెచ్చరించారు. నాలుగు నెలల పాలన చూస్తేనే పూర్తిగా టీడీపీ వైఫల్యం అర్థమవుతోంది. ప్రతిపక్షం లేకుండా ఎలిమినేట్ చేయాలనే దురుద్దేశంతో రాక్షస మూకలు హింసా కాండలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వై.యస్.జగన్ ఒక్క కనుసైగ చేసి ఉంటే అసలు ఇవాళ టీడీపీ ఉండేది కాదు. పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీని బీజేపీలో కలిపేసినట్లు వ్యవహరిస్తున్నారు.