చత్తీస్‌గఢ్ అడవులు కాల్పుల మోతతో మరోసారి దద్దరిల్లాయి. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవులు కాల్పులతో దద్దరిల్లాయి. అబూజ్‌మడ్ ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో తెలుగువారు ఉన్నట్లు సమాచారం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ జోరీగ నాగరాజు ఎన్‌కౌంటర్ హతమైనట్లు తెలుస్తోంది. నాగరాజుకు మావోయిస్టు పార్టీలో పలురకాల పేర్లు ఉన్నాయి.
నాగరాజును కమలేష్, రామకృష్ణ, ఆర్కే , విష్ణు అనే పేర్లతో పార్టీలోని కేడర్ పిలుస్తుంటారు. నాగరాజును పట్టుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది. రూ. 25 లక్షల రివార్డ్ ఉండటంతో నాగరాజు కేంద్ర కమిటీలో కూడా సభ్యుడు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు స్వస్థలం విజయవాడకు సమీపంలోని పోరంకి గ్రామం. దండకారణ్యం పార్టీ వ్యవహారాల్లో నాగరాజుది కీలక పాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.