కమలాపురం మండలంలో జూద స్థావరాలపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా మండలములోని గంగవరం గ్రామ సచివాలయం ప్రక్కన పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు.
జూదరుల వద్ద నుండి రూ. 3860 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa