ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 ఏళ్ల బాలుడితో 15 ఏళ్ల బాలిక.. మూడుసార్లు, ఇంట్లో రూ.50 వేలు ఎత్తుకెళ్లి మరీ..!

national |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 08:40 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పోలీసులకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. ఓ 15 ఏళ్ల బాలిక తరచూ 12 ఏళ్ల బాలుడితో పాటు వెళ్లిపోతుండటంతో.. వారిని వెతికి తీసుకురావడం పోలీసులకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఆ బాలుడితో బాలిక పారిపోవడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే తమ కుమార్తె ఇంట్లో నుంచి ప్రతీసారి వెళ్లిపోతుండటంతో ఆ కుటుంబం ఇళ్లు, ఊరు వదిలివెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల కళ్లుగప్పి.. ఆ బాలిక మళ్లీ పరారీ కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక.. మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యుల దగ్గరి నుంచి పారిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని సెక్టార్-58లో ఉన్న బిషన్‌పురా గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నోయిడా నుంచి బీహార్‌కు వెళ్తుండగా.. ఆ బాలిక పారిపోయింది. బీహార్‌కు వెళ్లేందుకు ఆ బాలిక కుటుంబం బయల్దేరగా.. ఆటో తీసుకురావడానికి ఆమె తండ్రి వెళ్లాడు. ఇక ఆమె తల్లి, చెల్లెలను బురిడీ కొట్టించి అక్కడి నుంచి ఆ బాలిక పరారైంది. దీంతో కుటుంబ సభ్యులు ఏడుస్తూ దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.


అయితే ఆ బాలిక ఇంటి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి పారిపోవడం ఇదేం కొత్త కాదు. ఇప్పటికే రెండు సార్లు ఆ బాలిక 12 ఏళ్ల అబ్బాయితో పారిపోగా.. ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు పోలీసులు ఆ బాలికను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ బాలిక, బాలుడు ఎక్కడ ఉన్నారో జాడ దొరకడం లేదు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


బాలిక తండ్రి మాట్లాడుతూ తమ స్వస్థలం బీహార్‌లోని దర్భంగా అని.. తనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెప్పాడు. పెద్ద కుమార్తె వయసు 15 ఏళ్లు కాగా.. చిన్న కుమార్తె వయసు 12 ఏళ్లని వివరించాడు. దాదాపు 4 ఏళ్ల క్రితం తన కుమార్తెల చదువుల కోసం బీహార్ నుంచి నోయిడాకు వచ్చి స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే బిషన్‌పురాలో అద్దె గది ఉంటూ.. భార్యాభర్తలిద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న స్కూల్‌లో ఇద్దరు కుమార్తెలు చదువుకుంటున్నట్లు తెలిపాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్ద కుమార్తె పొరుగున ఉన్న ఇంట్లో ఉండే మరో ఇద్దరు మైనర్ బాలికలను తన వెంట తీసుకెళ్లిందని ఆమె తండ్రి చెప్పాడు.


ఇక అప్పుడు వారం రోజుల పాటు గాలింపు చేపట్టి బాలికను పట్టుకున్నారు. ఆ సమయంలో బాలిక తన ఇంటి నుంచి రూ.50 వేలు తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు రాజస్థాన్ జైపూర్‌లోని బృందావనంలో బాలిక ఆచూకీ కనిపించింది. ఆ తర్వాత దాదాపు 15 రోజుల క్రితం ఆ బాలిక.. పొరుగున ఉన్న 12 ఏళ్ల బాలుడితో కలిసి కనిపించకుండా పోయింది. దీంతో నోయిడా వదిలి తిరిగి తమ స్వస్థలమైన బీహర్ దర్భంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తండ్రి పోలీసులకు తెలిపాడు. మంగళవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి దర్భంగా వెళ్తుండగా.. ఆ బాలిక, బాలుడితో కలిసి పరారైనట్లు చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com