ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా మంత్రులు సంతాపం తెలిపారు. అలాగే ఏపీ కేబినెట్లో కూడా రతన్ టాటా మృతి పట్ల సంతాపం తెలియజేశారు. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన అదర్శవాది రతన్ టాటా అని తెలిపారు. రతన్ టాటా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో రతన్ టాటా సేవలు అద్వితీయమని కొనియాడారు. కేవలం మన దేశంలోనే కాకుండా 100కు పైగా దేశాల్లో అనేక పరిశ్రమలు స్థాపించి అనేకమందికి ఉపాధి చూపించారన్నారు. రతన్ టాటా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.