తమిళనాడులో జరిగిన రైలు ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) వేగంగా వచ్చి గూడ్స్ రైలును ఢీకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన ఈ రైలులో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదం జరగడంతో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి-పుదుచ్చేరి మెము, పుదుచ్చేరి-తిరుపతి మెము, డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్, తిరుపతి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మెము, తిరుపతి-డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము, అరక్కం-పుదుచ్చేరి మెము, కడప-అరక్కోణం మెము అరక్కోణం-తిరుపతి మెము, తిరుపతి-అరక్కోణం మెము, విజయవాడ-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్, నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
తమిళనాడులో భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు వేగంగా వచ్చి తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో కొన్ కోచ్‌లు చెల్లాచెదురుగా పడిపోగా.. మరికొన్ని ఒకదాని పైకి మరొకటి పడ్డాయి. వెంటనే స్థానికులు, అధికారులు అప్రమత్తం అయ్యారు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ చనిపోలేదని దక్షిణ రైల్వే తెలిపింది.
గూడ్స్ రైలును ఢీకొన్నప్పుడు ముందుభాగంలో అన్నీ ఏసీ కోచ్‌లే ఉండటంతో వాటిలో ఉండే ప్రయాణికులు గాయపడ్డారు. చెన్నై రైల్వే డివిజన్ 044 2535 4151, 044 2435 4995 ఫోన్ నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. తెలుస్తోంది. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారికి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేశారు రైల్వేశాఖ అధికారులు. ఈ భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సి ఉంది. చెన్నై రైల్వే డివిజన్ 044 2535 4151, 044 2435 4995 ఫోన్ నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు.