శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు.
రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు కొనసాగనుంది. వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa