ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి. మైలవరం నియోజకవర్గంలో 'పల్లెపండుగ' ఘనంగా జరుగుతోంది. మైలవరంలో మంగళవారం నిర్వహించిన పల్లెపండుగ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైలవరం మేజర్ పంచాయతీలో రూ.1.60 కోట్ల ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో దేవునిచెరువులో రోడ్లకు, పొందుగల వెళ్లే రహదారి నిర్మాణానికి, 4వ సచివాలయం పరిధిలో, ఇంకా పలు రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ... 'గత ప్రభుత్వ విధ్వంస పాలనలో రహదారుల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదు. దాని కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తోంది. పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తోంది. ఇప్పటికే ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం కింద నిధులను కేటాయించాం. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.22.5 కోట్లు కేటాయించాం. ఇందులో మైలవరం మండలానికి రూ.5 కోట్లు మంజూరు చేశాం. మేజర్ పంచాయతీ అయిన మైలవరంకు రూ.1.60 కోట్లు మంజూరు చేశాం. వచ్చే రెండు వారాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 'పల్లెపండుగ'ను గొప్ప వేడుకగా నిర్వహించడానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు." అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జై కేపి అనే నినాదాలతో హోరెత్తించారు. ఈకార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.