రానున్న నాలుగు రోజుల్లో చెన్నైలో భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని ఐఎండీ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు. వేలచేరి వంటి లోతట్టు ప్రాంతాల్లోని పరిసరప్రాంత ప్రజలు తమ కార్లను ఫ్లైఓవర్లపై పార్క్ చేశారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ పై అలా పార్క్ చేసిన వాహనాలపై చలాన్లు విధిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.భారీ వర్షాలు, వరదల వల్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్ల ముందు పార్క్ చేసిన కార్లు, బైక్ ల వంటి వాహనాలు తీవ్రంగా ధ్వంసమవుతున్నాయి. మరికొన్ని వరదలో కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే జరిమానాలు విధించినప్పటికీ తమ వాహనాలను కాపాడుకునేందుకు ఫ్లై ఓవర్లపై పార్క్ చేస్తున్నట్టు వాహనదారులు చెప్తున్నారు.