సీతానగరంలోని హడ్కో కాలనీ సమీపంలో సుమారు 60 ఏళ్ల వయసుగల గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. గుర్తుతెలియని వ్యక్తి బుధవారం ఉదయం రైల్వే పట్టాలు దాటడానికి వస్తున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్ల గాని, రైలు వెళ్లే వేగానికి అదిరి కింద పడిపోయి తలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసు దర్యాప్తు నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు మృతుడు తెలుపు రంగు ఫుల్ కమీజు (లాల్చీ), బ్లూ రెడ్ చెక్స్ లుంగీ ధరించాడు. మృతుడికి సంబంధించిన ఆచూకీ తెలిస్తే విజయనగరం రైల్వే ఎస్ఐ వి.బలిజిరావు ఫోన్ నెంబరు 9490617089, లేదా బొబ్బిలి రైల్వే ఔట్‌పోస్టు ఇన్చార్జి బి.ఈశ్వరరావు ఫోన్ నెంబరు 9491813163 నెంబర్లకు తెలియజేయాలి.